ఇదే నా చివరి రోమ్ కామ్.. రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్‌బీర్ కపూర్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్‌బీర్ కపూర్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అతను చేసే రొమాంటిక్ సినిమాలకు పిచ్చి క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్లో ఎందరో హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన రణ్‌బీర్ తాజాగా ఆలియా భట్‌ను పెళ్లి చేసుకుని మంచి ఫాదర్‌గా కూడా సెటిలైపోయాడు. రీసెంట్గా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక నుంచి మాట్లాడుతూ.. ''ఇక నుంచీ రొమాంటిక్ కామెడీ మూవీస్ చేయాలనుకోవడం లేదు. వాటికి దూరంగా ఉంటాను. కారణం.. రొమాంటిక్ మూవీ చేసీ చేసీ నాకు విసుగొచ్చింది. అందుకే చేయదల్చుకోవడం లేదు. మారిన ట్రెండ్‌కు, నాకున్న ఇమేజ్‌కు లవ్‌స్టోరీస్ సెట్ కావని నా ఫీలింగ్'' అన్నారు. ప్రస్తుతం తాను లవ్ రంజన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నానని. ఇదే నా చివరి రోమ్ కామ్ స్పష్టం చేశారు.
Also Read...