రానా తమ్ముడిని వదలనంటున్న శ్రీరెడ్డి.. ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని..
టాలీవుడ్‌లో పెద్ద సినిమా ఫ్యామిలీస్‌లో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇప్పటికే సురేష్ బాబు పెద్ద కొడుకు రానా హీరోగా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్త్రీలో పెద్ద ఫ్యామిలీస్‌లో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇప్పటికే సురేష్ బాబు పెద్ద కొడుకు రానా.. హీరోగా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ వంశం నుంచి మరో హీరో తెరంగేట్రం జరగబోతోంది. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ ఫస్ట్ మూవీ తెరకెక్కనుంది. 'అహింస' టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఈ క్రమంలోనే ఓ భయం కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అభిరామ్‌ను కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈసారి కూడా అభి తెరంగేట్రాన్ని టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతుందట. ఇంతకు మందు అభిరామ్ విషయంలో తనను అవకాశాల పేరుతో లైంగికంగా వేధించాడని, వాళ్ల స్టూడియోలోనే తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక అభిరామ్ ఫస్ట్ సినిమా రిలీజ్‌కు శ్రీ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.