గొప్ప మనసు చాటుకున్న రానా భార్య

2020లో తన ప్రేయసి మిహీకా బజాజ్ ని వివాహం చేసుకున్న రానా దగ్గుబాటి ఒక ఇంటివాడయ్యాడు.

Update: 2023-04-05 14:29 GMT

దిశ, సినిమా: 2020లో తన ప్రేయసి మిహీకా బజాజ్ ని వివాహం చేసుకున్న రానా దగ్గుబాటి ఒక ఇంటివాడయ్యాడు. ఇక మిహీక గురించి చెప్పాలి అంటే .. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే మిహీక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన చాలా తొందరగా వైరల్ అవుతాయి. తాజాగా ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పేద వారి కోసం మిహీక ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలిసి సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇండియాలో విద్యుత్ సౌకర్యం లేని, మారుమూల గ్రామాల్లో, పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్నే మిహీక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక విషయం తెలుసుకున్న అభిమానులు మిహీక గొప్ప మనసుకి ఫిదా అవుతున్నారు.

Read more:

తల్లి కాబోతున్న మెగా డాటర్ నిహారిక?

బన్నీ పరువు తీయోద్దంటూ.. స్నేహకు వార్నింగ్ ఇచ్చిన ఓ నెటిజన్!

రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన ఎంత పెద్దదో తెలుసా?

Tags:    

Similar News