కొడుకుతో స్పెషల్ పోస్ట్ చేసిన రామ్.. షాక్‌లో ఫ్యాన్స్!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో రామ్ పోతినేనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్ల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. రహాస్యంగా తన చిన్ననాటి స్నేహితురాలిని ఆయన వివాహం చేసుకోబోతున్నాడని రకరకాల రూమర్లు వచ్చాయి. వీటిపై రామ్ స్పందించారు. దీంతో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. తాజాగా, రామ్ ట్విట్టర్ వేదికగా చిన్నపిల్లాడితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ సండే సందర్భంగా సిద్ధాంత్ పోతినేని అనే క్యాప్షన్ పెట్టాడు. అది చూసిన నెటిజన్లు ఏంటి రామ్‌కి పెళ్లై.. ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? ఇదంతా ఎప్పుడు జరిగింది. సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటూ రకరకాల కామెంట్స్ మీమ్స్ చేస్తున్నారు. అయితే ఆ పిల్లాడు రామ్ అన్న కొడుకు సమయం దొరికినప్పుడల్లా ఆ బుడ్డోడితో ఆడుతూ కనిపిస్తాడు రామ్.
Coz it's a SONday.. #Sidhanthpothineni pic.twitter.com/8hrXNNsjly
— RAm POthineni (@ramsayz) January 8, 2023