Ram Charan: మెల్ బోర్న్ ఫెస్టివల్స్ కి గౌరవ అతిథిగా రామ్ చరణ్
రోజు రోజుకి చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరుగుతుంది
దిశ, సినిమా: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గొప్ప స్థాయికి ఎదిగాడు. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు నటన కూడా రాదని రామ్ చరణ్ పై ఘాటు విమర్శలు చేసారు కానీ, ఇప్పుడు ఇతర దేశాల వారు కుడా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం వేచి చూస్తున్నారు. ఇటీవలే అంబానీ పెళ్లిలో కూడా చెర్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. రోజు రోజుకి చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరుగుతుంది. తాజాగా మరో అరుదైన గౌరవం రామ్ చరణ్ కు దక్కింది.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్‌లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. అక్కడకి అతిథిగానే కాకుండా ఇండియన్ సినిమాకి ఎన్నో సేవలు చేసిన రామ్ చరణ్ అంబాసిడర్ అవార్డును అందుకోనున్నారు. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి యేటా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు జరగనుంది.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-2024 నేను కూడా ఒక భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ విజయం చిన్నది కాదు అది విశ్వవ్యాప్తం. ఈ క్షణాన్ని మెల్‌బోర్న్‌లోని సినీ ఆడియెన్స్ తో షేర్ చేసుకోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను అంటూ రామ్ చరణ్ తెలిపారు.