Ram Charan: ఇక్కడ రామ్.. కొ.. ణి.. దె.. ల.. రామ్ చరణ్ అస్సలు తగ్గడం లేదుగా!
రాజమౌళి చేతిలో పడితే సినిమా పూర్తి కాకుండా ఇంకో సినిమా చేయడానికి అవకాశం అస్సలు ఉండదు.
దిశ, వెబ్ డెస్క్ : రాజమౌళి చేతిలో పడితే సినిమా పూర్తి కాకుండా ఇంకో సినిమా చేయడానికి అవకాశం అస్సలు ఉండదు. అలాంటిది రాజమౌళికి ఏం మాటలు చెప్పాడో కానీ బుట్టలోపడేసి ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగానే ఆచార్య సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమా చిన్న రోల్ కాబట్టి జక్కన ఓకె చెప్పారంటూ అప్పటిలో పలు వార్తలు వచ్చాయి.
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాకుండానే శంకర్ సినిమాను పట్టాలెక్కించాడు. ఇప్పటికే విడుదలవ్వాలిసిన శంకర్ సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. సెప్టెంబర్ నుంచి బుచ్చి బాబు సినిమాని మొదలు పెట్టనున్నాడట. మొదటిగా ఈ కథను ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. కానీ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ అవ్వడం వలన ఇదే కథను రామ్ చరణ్‌కి చెప్పి ఒప్పించాడట.మొత్తానికి చెర్రీ కెరియర్ని గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు.
Also Read..