త్వరలోనే మీ ముందుకు.. మొత్తం పూర్తి చేసుకున్న రామ్ చరణ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’.

Update: 2024-07-07 08:41 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, హ్యారీ జోష్, ఎజ్‌జే సూర్య, సముద్రఖని, జయరామ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అందుకున్న సమాచారం మేరకు.. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి అయిపోయిందట. ఇక వారం పది రోజుల్లో ప్యాచ్ వర్క్ కూడా పూర్తయితే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింట్ కంప్లీట్ అయినట్లే. ఇక త్వరలోనే రిలీజ్ డేట్‌పై కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మూవీ మేకర్స్. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. రామ్ చరణ్ మూవీ త్వరలోనే రాబోతుందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Similar News