ఉపాసన నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు.. సంచలన నిజాలు బయటపెట్టిన రామ్ చరణ్
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో రామ్ చరణ్-ఉపాసన ఒకరు. 2012లో వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
దిశ, సినిమా: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో రామ్ చరణ్-ఉపాసన ఒకరు. 2012లో వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వివాహమైన 11 ఏళ్ల తర్వాత వీరికి పాప జన్మించింది. ఈ బుజ్జాయికి రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో నిండిపోయింది. ఈమెకు క్లీంకార అని నామకరణం చేశారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
అయితే మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా చరణ్-ఉపాసన ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘‘‘నా సతీమణి కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదు.ఉపాసన నాకు ఒక మంచి భార్య. తను చేసిన ఎన్నో మంచి పనులే ఆమెను ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో ఉపాసన తనదైన ముద్ర వేసుకుంది. ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తుంది.
కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఉపాసన నా రాక్ స్టార్. తను చేసిన పనిని నేను ఎప్పుడు చేయలేను. తను స్వంత మార్గాన్ని సృష్టించుకుంటుంది’’. అంటూ రామ్ చరణ్ ఉపాసనను కొనియాడాడు. ‘‘ఇక ఉపాసన మాట్లాడుతూ.. ‘‘చరణ్ కు నీడలా ఉంటున్నందుకు చాలా ఫ్రౌడ్ గా ఫీల్ అవుతున్నా.
పెళ్లాయ్యాక వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపిస్తుంది. నా ఫ్యామిలీ, చరణ్ కుటుంబం పూర్తిగా డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు. అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా అమ్మ వాళ్లను తాతయ్య ఆత్మవిశ్వాసంతో పెంచారు. నా ఫ్యామిలీలోని మహిళలు నా జీవితంలో ముఖ్య పాత్ర పోషించారు’ అంటూ ఉపాసన వెల్లడించింది.