ఏపీ, తెలంగాణకు విరాళం ప్రకటించిన రామ్ చరణ్

వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన ప్రజలను ఆదుకునేందుకు మరో మెగా హీరో ముందుకొచ్చారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున.. కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

Update: 2024-09-04 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన ప్రజలను ఆదుకునేందుకు మరో మెగా హీరో(Mega Hero) ముందుకొచ్చారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్(Ram Charan) చెరో రూ.50 లక్షల చొప్పున.. కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు ప్రజలను మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌(CM Relief Fund)కు కోటి రూపాయల విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రకటించారు. కాగా, ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల సాయం, మెగాస్టార్ చిరంజీవి రూ.1 కోటి సాయం, అల్లు అర్జున్ రూ. కోటి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

 More News : తెలుగు రాష్ట్రాలకు అక్కినేని కుటుంబం విరాళం


Similar News