వైట్ శారీలో మెరిసిపోతున్న రకుల్.. నీ అందం మాటల్లో వర్ణించలేనిదంటున్న నెటిజన్లు!
స్టార్ బ్యూటీ రకుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: స్టార్ బ్యూటీ రకుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే హఠాత్తుగా వివాహబంధంలోకి అడుగుపెట్టి, అభిమానులను ఆశ్చర్యపరిచింది రకుల్‌ప్రీత్ సింగ్. అయితే చాలా విరామం తర్వాత కమల్‌హాసన్ 'భారతీయుడు 2'తో పలుకరిస్తోంది. అలా సినిమాలతో, ఫ్యామీలీతో లైఫ్‌ను లీడ్ చేస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలతో పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలోనే ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇన్‌స్టా వేదికగా రకుల్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు, తన భర్త ఇద్దరు కూడా వైట్ కలర్ దుస్తులు ధరించి ఫొటోలకి పోజులిచ్చారు. అది చూసిన నెటిజన్లు బోత్ ఆర్ లుకింగ్ గుడ్ అని.. నీ అందాన్ని వర్ణించడానికి మాటల్లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.R