పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అభిమానులను అలరించింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంటూ బాలీవుడ్‌లో నటిస్తోంది. ఆ నేపథ్యంలో త్వరలో రకుల్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు, జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేపుకోబోతున్నారంటూ రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రకుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'అమన్ నిజంగానే క్లారిటీ ఇచ్చావా? నాక్కుడా చెప్పాలి కదా బ్రో' నా జీవితం గురించి నాకే తెలియకపోవడం ఫన్నీగా ఉంది''. అంటూ రాసుకొచ్చింది. అంటే కాకుండా తన తమ్ముడుని అమన్ ప్రీత్‌ను ట్యాగ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
ఎల్లో కలర్ శారీలో అబ్బా.. అనిపిస్తున్న 'హెబ్బా'
Mahesh Babu అల్ట్రా స్టైలిష్ లుక్
😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it's funny how I don't have news about my life .. https://t.co/ZSZgNjW2BW
— Rakul Singh (@Rakulpreet) October 12, 2022