పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఇటీవల ఈ అమ్మడుకు సంబంధించిన చాలా రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీభగ్నానితో ప్రేమలో పడిందనే విషయాన్ని ఆమె స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత వీరు కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేశారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు వీరిద్దరికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని సోషల్ మీడయా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా, దీనిపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.
నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నేను నవంబర్లోనే పెళ్లి చేసుకున్నానంట, నాకే తెలియదు, అసలు నా పెళ్లి ఎలా జరిగిందో ఎవరూ చెప్పట్లేదు, నా ధ్యాసంతా యాక్టింగ్ పైనే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో రకుల్ పెళ్లి వార్తల రూమర్లకు చెక్ పడ్డట్లు అయ్యింది.