మతాలు ఉన్నది అందుకే.. కానీ! సూపర్ స్టార్ కామెంట్స్ వైరల్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘లాల్ సలామ్’.
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. చాలా గ్యాప్ తర్వాత ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్, టీజర్‌కు మంచి రెన్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మతం అనే అంశం కూడా ప్రధానంగా ఉండనుంది. దీంతో ఈ సినిమాపై కాస్త నెగిటివిటి కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే.. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో బిబీగా ఉన్న చిత్ర బృందం.. ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍గా నిర్వహించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మతంపై వైలర్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘దేవుడు గురించి మనుషులు అర్థం చేసుకోవడానికి, తమలో దేవుడు ఉన్నాడని వాళ్లు గుర్తించేందుకు, ప్రశాంతంగా జీవించేందుకు మతాలు ఉన్నాయి. కానీ చాలా మంది వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. మతాల పేరిట ఘర్షణలకు దారి తీస్తున్నారు. అన్ని మతాలు కూడా మానవత్వానికి లాభం చేకూర్చేలా ఉంటాయి. అయితే.. కొందరూ మాత్రం మా దేవుడే గొప్పా, మేమే గొప్పా అని గొడవలు పెంచుతున్నారు. అందుకే మత సామరస్యంపై సందేశం ఇచ్చేందుకే నేను ‘లాల్ సలాం’ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక ఎన్నో మతాలు వస్తుంటాయి.. పోతుంటాయని రామకృష్ణ పరమహంస చెప్పారు. కానీ న్యాయం, సత్యం, నిజాయితీ ఉన్న మతాలు శతాబ్దాలైనా కొనసాగుతూనే ఉంటాయి. క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, హిందూయిజాల్లో ఈ క్వాలిటీలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతికూలతలు ఎదురైనా దృఢంగా నిలబడ్డాయి’ అంటూ చెప్పెకొచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.