పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’!

రాజ్‌తరుణ్‌, హాసిని సుధీర్‌ జంటగా రూపొందిన చిత్రం 'పురుషోత్తముడు'.

Update: 2024-07-27 14:11 GMT

దిశ, సినిమా: రాజ్‌తరుణ్‌, హాసిని సుధీర్‌ జంటగా రూపొందిన చిత్రం 'పురుషోత్తముడు'. రామ్ భీమన దర్శకత్వంలో డా.రమేష్‌ తేజావత్‌, ప్రకాష్‌ తేజావత్‌ నిర్మించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'కంటెంట్‌ కొత్తగా ఉంటే ప్రేక్షకులు సినిమా ఆదరిస్తారనే విషయం మా చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ 'క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది. పూల రైతుల సమస్యలను తెరపై చూపించడం అనేది ఒక కొత్త నేపథ్యం అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మంచి సినిమా చూడలేదు అని ప్రేక్షకులు చెబుతుంటే గర్వంగా ఉంది. తప్పకుండా ఇది అందరూ చూడాల్సిన సినిమా' అన్నారు. ఈ చిత్రంలో తను చేసిన అమ్ములు పాత్రకు మంచి స్పందన వస్తోందని, ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ హాసిని సుధీర్‌ తెలిపారు.

Read more...

Teaser: మనం ఆర్డినరీ అయినా అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి.. వైరల్‌గా నాని డైలాగ్స్ 

Tags:    

Similar News