Hero Raj Tarun : లావణ్య వివాదంపై స్పందించిన రాజ్ తరుణ్.. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి

ఎట్టకేలకు రాజ్ తరుణ్ బయటకొచ్చి ప్రెస్ మీట్లో జాయిన్ అయ్యాడు

Update: 2024-07-31 12:57 GMT

దిశ, సినిమా: ఎట్టకేలకు రాజ్ తరుణ్ బయటకొచ్చి ప్రెస్ మీట్లో జాయిన్ అయ్యాడు.ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. గత కొన్ని రోజులుగా కనిపించని రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి మూవీ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు. ఇక మీడియా వారికి ఛాన్స్ దొరికేసింది అడగాల్సిన ప్రశ్నలు మొత్తం అడిగేసారు.

ఈ ఈవెంట్లో లావణ్య వివాదం గురించి ప్రశ్నించగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. "ఆ అమ్మాయితో నాకు ఎప్పుడో లవ్ బ్రేకప్ అయింది, ఆమె మాటల్లో నిజం లేదు అన్ని అబద్దాలే చెబుతుంది. ఇక నాపై ఆరోపణలు చేసేవాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను లీగల్ గానే వెళ్తాను, ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను.. వాళ్ళు మాటలు మాత్రమే చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా ఆధారాలు చూపించట్లేదు. నేను మొదటి సారి మీడియాతో ఏమి చెప్పానో అదే నిజం. నా దగ్గర కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి.

నాకు ఎవరి పేరు చెడగొట్టడం ఇష్టం ఉండదు అందుకే పేర్లు బయట చెప్పడం లేదు. నాకు పోలీసులు నుంచి నోటీసులు వచ్చాయి. నేను దానికి కూడా సమాధానం ఇచ్చాను. నేను వెళ్లలేదు నా తరపున లాయర్ హాజరయ్యారు. లావణ్య పెట్టిన కేసులో అబార్షన్ గురించి లేనే లేదు అదంతా అబద్దం" అని తెలిపారు.

Tags:    

Similar News