‘కల్కి’ థియేటర్‌లో వర్షం చినుకులు.. 4 డీఎక్స్ ఎఫెక్ట్ అనుకుంటా?

హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. ఈ వర్షం తాకిడికి వాహనదారులే కాకుండా ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు వర్షం తాకిడి తగిలింది.

Update: 2024-07-14 15:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం పలుచోట్ల వర్షం దంచి కొట్టింది. ఈ వర్షం తాకిడికి వాహనదారులే కాకుండా ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు వర్షం తాకిడి తగిలింది. అవును మీరు విన్నది నిజమే.. ఇవాళ కల్కి షో నడుస్తున్న ఓ థియేటర్‌లో వర్షం చినుకులు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి కల్కి షో ఆపేయాల్సి వచ్చినట్లు సమాచారం. అయితే, థియేటర్‌లోపలికి వర్షం చినులు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. నగరంలోని పంజాగుట్ట పీవీఆర్ థియేటర్‌లో వర్షం చినుకులు పడ్డాయి. దీంతో యాజమాన్యం షోను ఆపేసింది. కాగా, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వర్షం చినుకులు థియేటర్ లోపటికి రావడం 4డీఎక్స్ ఎఫెక్ట్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కాగా, ఆదివారం సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్, లింగంపల్ల, కూకట్‌పల్లి, చందానగర్, హైదర్‌నగర్, మూసాపేట్, జీడిమెట్ల, పంజాగుట్ట, ఎర్రంమంజిల్ ఖైరతాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్లో అవ్వడంతో వాహనాదారులకు చుక్కలు కనిపించాయి.

Tags:    

Similar News