Drugs Case: నేను డ్రగ్స్ తీసుకోలేదు.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు
దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే ఆ పబ్‌కి వెళ్లానని, తాను డ్రగ్స్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు అసలు లేదన్నాడు. నిర్ణీత సమయానికి మించి పబ్స్ నడిపితే వాటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కానీ.. తనను ఇబ్బంది పెట్టడం ఏంటని రాహుల్ సిప్లిగంజ్ ప్రశ్నించాడు.
కాగా రాడిసన్ పబ్ వ్యవహారంపై నార్కోటిక్ వింగ్ రంగంలోకి దిగింది. లా అండ్ ఆర్డర్ సీపీ ఆధ్వర్యంలో నార్కోటిక్ స్పెషల్ వింగ్ చర్యలు చేపట్టింది. డ్రగ్స్ గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక పరికరం ఉపయోగిస్తున్నారు.