‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్.. నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్ కాగా.. అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇక సినిమా విడుదలకు ఎంతో సమయం లేకపోవడంతో వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తు్న్నారు చిత్ర బృందం.
ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకోగా.. ఈ సాంగ్ కూడా మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా.. ఈ పాటలో దాదాపు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారని తెలుస్తుండగా.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులు వెయ్యడం విశేషం. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. కాగా.. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ సెకండ్ సింగిల్ కూడా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో సరికొత్త ఎనర్జీనిచ్చే విధంగా ఆకట్టుకుంటోంది.