Pawan Kalyan: ఆసక్తికర ఫోటో షేర్ చేసి పవన్ కు బర్త్ డే విషెష్ తెలిపిన నిర్మాత SKN

ఆసక్తికర ఫోటో షేర్ చేసి పవన్ కు బర్త్ డే విషెష్

Update: 2024-09-02 07:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త మూవీ వస్తుందంటే చాలు.. రెండు రోజుల నుంచే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు.. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కొత్త మూవీ అప్డేట్స్ రావడం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు నేడు. రెండు తెలుగు రాష్ట్రాల పవన్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే బేబీ మూవీ నిర్మాత SKN, ప‌వ‌న్‌కు ప్రత్యేకంగా విషెస్ తెలియ‌జేశారు.

" కళ్యాణ్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఎదిగిన మీ చరిత్ర అందరికి ఆదర్శం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం. అన్నయ్య కు తమ్ముడిగా మొదలై లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలు ఎదగాలి. ప్రజల నాయకుడిగా వారి మధ్యే ఉంటూ జనాల అవసరాలను తీరుస్తూ ఏ సాయం కావాలన్నా వారి అండగా నిలిచిన మీ జీవితం స్ఫూర్తిదాయకం. ఉత్తేజ పూరితం ఉత్ప్రేరకం సంకల్ప కారకం. దశాబ్దాలుగా మీ బాటలో నడక వ్యాపకం కాదు నిలిచి ఉండే జ్ఞాపకం. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు" అంటూ ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News