15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటపై నిలబడ్డ రాజమౌళి.. నిర్మాత ఎమోషనల్ కామెంట్స్

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

Update: 2024-05-03 13:29 GMT

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం. ఇక ఈయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులతో సహా, సినీ ప్రపంచం కూడా ఎదురుచూస్తుంది. ‘బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ వంటి మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు సైతం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడట. ఈ క్రమంలోనే రాజమౌళి తర్వాత చేయబోయే సినిమాను నిర్మించే అవకాశాన్ని 15 ఏళ్ల క్రితం మాట ఇచ్చిన ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు ఇచ్చారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారాయణ ఈ విషయాలను తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ‘రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో నా బ్యానర్ (దుర్గా ఆర్ట్స్)లో సినిమా చెయ్యాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు రాజమౌళి, మహేశ్ ఇద్దరు పెద్ద స్థాయిలో ఉన్నారు. వీళ్లతో సినిమాలు చెయ్యడానికి ఎంతో మంది నిర్మాతలు చూస్తున్నారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో ‘దుర్గా ఆర్ట్స్ బ్యానర్’లో సినిమా తియ్యనున్నట్లు వాళ్లే ప్రకటించారు. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు వచ్చిన వాటిని పక్కన పెట్టి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిర్మాత కేఎల్ నిర్మాత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News