బాలయ్య ‘లెజెండ్’ నిర్మాత అనిల్ సుంకర ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనిల్ పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనిల్ పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘ఈ రోజు బ్యాడ్ న్యూస్‌తో తెల్లారింది. మా పెదనాన్న సుంకర బసవరావు గారు మరణించారు. నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. అన్ని రకాలుగా నన్ను పోత్సహిస్తూ నా సక్సెస్‌లో భాగమైన పెదనాన్న లేరనే వార్త నన్ను కలచివేసింది.
మా ఇన్సోవేషన్స్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము. ఎంచుకున్న రంగంలో కష్టపడి సక్సెస్ సాధిస్తూ మీరు గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మంచు మనోజ్ హీరోగా నటించిన ‘బిందాస్’ చిత్రంతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన అనిల్ సుంకర.. మహేశ్ బాబుతో దూకుడు, ఆగడు, బాలకృష్ణతో లెజెండ్, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు.
Also Read...