‘రానా నాయుడు’లో సెక్స్ సీన్స్.. ఇష్టంలేకపోయినా తప్పలేదట
ఇష్టంలేకపోయినా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం తన వేషాధారణ మార్చుకోవాల్సి వచ్చిందంటోంది ప్రియా బెనర్జీ. వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలవగా.
దిశ, సినిమా : ఇష్టంలేకపోయినా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం తన వేషాధారణ మార్చుకోవాల్సి వచ్చిందంటోంది ప్రియా బెనర్జీ. వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలవగా.. ఇందులో చాలా బోల్డ్‌గా నటించిన ప్రియా తాజా ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఈ సిరీస్ కోసం నా పొడవాటి జుట్టు కత్తిరించుకున్నా. వేషాధారణ విషయంలోనూ పలు మార్పులు చేసుకున్నా. కొన్నిసీన్లు మనకు ఇష్టం లేకపోయినా ప్రేక్షకుల కోసం చేయక తప్పదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ భాష సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు థాంక్స్’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సిరీస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా.. ముఖ్యంగా వెంకీని ఇలాంటి పాత్రలో ఉహించుకోలేమంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.
Also read: ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్న మహానటి.. వీడియో వైరల్..
ఆయనతో నన్ను పోల్చవద్దు.. ఆ స్థాయికి నేను చేరుకోలేను