సమంతతో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన ప్రీతమ్.. మా గురించి నాగచైతన్యకు కూడా తెలుసని
స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయింది.
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఉంది. అయితే సామ్, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జూవాల్కర్తో క్లోజ్‌గా ఉంటుందని. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అంతేకాకుండా ప్రీతమ్ వల్ల చై, సామ్ విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. దీనిపై అటు సమంత, ప్రీతమ్ ఖండించారు. అయినా రూమర్స్ ఆగడం లేదు తరచూ వస్తూనే ఉన్నాయి.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతమ్, సమంతతో రిలేషన్‌షిప్‌పై స్పందించాడు. ‘‘ తెలిసిన , క్లోజ్‌గా ఉన్న ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నవారికి సపోర్ట్‌గా నిలవడమనేది కామన్. నేను అదే చేశాను. సమంత క్లోజ్ కావడంతో ఆమెకు సపోర్ట్‌గా ఉన్నాను. అంతేకానీ మా మధ్య ఏం లేదు. బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది. ఈ విషయం నాగచైతన్యకు కూడా తెలుసు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది. దాన్ని కొందరు తప్పు పట్టడం బాధగా అనిపించింది. నేను చాలా అగ్రెసివ్ పర్సన్ నాపై ఏదైనా రూమర్స్ వస్తే తట్టుకోలేను. ఒక్క చెంపదెబ్బ కొడితే నేను పది దెబ్బలు కొట్టే రకం. అలాంటి నాపై కామెంట్స్ చేయడానికి వాళ్లు ఎవరంటూ ఫైర్ అయ్యాను కానీ, కెరీర్‌కి ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది హెచ్చరించారు. ఈ క్రమంలో బాధ బయటకు చెప్పుకోలేదు కానీ, లోపల చాలా బాధపడినట్లు తెలిపారు. అంతేకాకుండా తాను హీరో, హీరోయిన్లకే కాకుండా సినిమాల కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నాని పేర్కొన్నాడు. అలాగే ఇటీవల విడుదల ధమాకా, యశోద సినిమాలకు పని చేసినట్లు తెలిపాడు. ప్రస్తుం ప్రితమ్ చేసిన కామెంట్స్ పోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read..