Hero Prasanth: రామ్ చరణ్ కోసమే ఆ సినిమా చేసానంటూ సీక్రెట్స్ చెప్పిన ప్రశాంత్
జీన్స్, జోడీ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్రశాంత్ మనందరికి సుపరిచితమే
దిశ, సినిమా : జీన్స్, జోడీ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్రశాంత్ మనందరికి సుపరిచితమే. ఇతను నటించిన అంధగన్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ విధేయ రామ మూవీలో ఎందుకు నటించాల్సి వచ్చిందో సీక్రెట్స్ బయటకు చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
" నేను ఎక్కువగా మా సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేశానని అన్నారు. ఇతర నిర్మాణ సంస్థలలో పని చేయడానికి ఇష్ట పడను. రామ్ చరణ్ తో స్నేహం కారణంగానే వినయ విధేయ రామ మూవీలో నటించాను. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఉందని ప్రశాంత్ మా ఇద్దరి మధ్య అనుబంధంతో చేసాను. డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఆ పాత్రకు నేనే సెట్ అవుతానని నన్ను సంప్రదించడంతో నేను ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది. శ్రీను అన్నా నాకు ఎంతో గౌరవం ఉందని" ఆయన మాటల్లో వెల్లడించాడు. ప్రశాంత్ చెప్పిన ఈ సీక్రెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.