Pony Verma : అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. Prakash Raj భార్య షాకింగ్ కామెంట్స్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని కూడగట్టుకున్నారు. ఇక హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్ : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని కూడగట్టుకున్నారు. ఇక హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే.
కాగా, తాజాగా పోనీ వర్మ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా సహాయకారిగా ఉంటారు.నేను షూట్ కి వెళ్తే అతడు ఇంట్లో ఉంటాడు. కుటుంబ సభ్యుల సహకారం కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ నాకు హైదరాబాదే సొంత ఇల్లు, హైదరాబాద్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం నా కుమారుడు కూడా ఇక్కడే పాఠశాలకు వెళ్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చే స్థిరపడతానని అసలు ఊహించలేదని తెలిపింది. నాకు వంట కూడా రాదు.. ప్రకాష్ రాజ్ అద్భుతంగా వంట చేస్తారు..సాంబార్, ఉప్మా , పోహ చాలా రుచికరంగా చేస్తాడు. అతడిని పెళ్లి చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అంటూ పోనీ వర్మ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. నువ్వు ప్రకాశ్ రాజ్‌ని పెళ్లి చేసుకుంది వంట చేయడానికేనా, ప్రేమతో కాదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.