చెల్లి పెళ్లిలో కంట్రోల్ తప్పిన Pragathi: బ్యాండ్పైకి ఎక్కి మరీ (వీడియో)
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రగతి గురించి తెలిసిందే. అక్క, తల్లి, భార్య, వదిన,
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రగతి గురించి తెలిసిందే. అక్క, తల్లి, భార్య, వదిన, అత్త లాంటి పలు పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది ప్రగతి. ఈ క్రమంలోనే తాజాగా తన చెల్లి పెళ్లిలో చేసిన హంగామాను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియాలో ప్రగతి కంట్రోల్ తప్పి మరీ డాన్స్‌లు వేసింది. భాజా భజంత్రీల మధ్య సందడిగా సాగుతున్న పెళ్లిలో బ్యాండ్ పైకి ఎక్కి కూర్చుని మరీ చిందులేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్.. ''పాపం వెనకాల ఉన్నవాడు మోయలేక చస్తున్నాడు.. ఏం కాదు తగ్గిపోతుందిలే'' అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE
Guppedanta Manasu: స్నేహమంటే ఇదేనా అంటూ గౌతమ్‌ని ప్రశ్నిస్తున్న రిషి !