ప్రభాస్‌కి ఆ ప్లేస్‌లో సర్జరీ జరగనుందట.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన అభిమానుల కోరిక మేరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇటీవల ‘ఆదిపురుష్’ మూవీతో పలకరించగా.. సెప్టెంబర్ 28న ‘సలార్’తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన అభిమానుల కోరిక మేరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నాడు. ఇటీవల ‘ఆదిపురుష్’ మూవీతో పలకరించగా.. సెప్టెంబర్ 28న ‘సలార్’తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే అతను హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే వరుస మూవీస్‌తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడట. కాగా ‘సలార్’ మూవీ పనులు పూర్తి కాగానే అందుకు సంబంధించిన సర్జరీ కూడా జరగనుందట. అనంతరం ఈ స్టార్ హీరో కొన్ని రోజులు పూర్తి రెస్టులో ఉంటాడట. దీనిపై ప్రజెంట్ ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, వినిపిస్తున్న వార్తా కథనాలతో ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.
Read More: Salaar : డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘సలార్’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!