Prabhas sister: సిస్టర్స్‌తో ప్రభాస్ రాఖీ సెలబ్రేషన్స్.. క్యూట్ పిక్స్ వైరల్

రాఖీ పండుగ సెల‌బ్రేషన్స్‌లో ప్రభాస్‌కు అతని సిస్టర్స్‌ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2024-08-20 06:01 GMT

దిశ, సినిమా: అన్నా చెల్లుళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా పేర్కొనే రాఖీ పండుగను ప్రజలందరూ సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఇక బ్రదర్స్ అయితే సిస్టర్స్‌కు తమకు తోచిన, నచ్చిన బహుమతులు ఇచ్చారు. ఇలా సంతోషంగా జరుపుకున్న రాఖీ పండుగ ఫొటోలను, వీడియోలను పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా ప్రజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇంట రాఖీ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ప్రభాస్ సినిమాల పరంగా చాలా ఫేమస్ అయినప్పటికీ తన కుటుంబంతో.. ముఖ్యంగా అతని చెల్లెళ్లతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదు. దీంతో ఈ రాఖీ పండుగ నాడు ప్రభాస్‌తో కలిసి అతని సిస్టర్స్ ప్రసీద, ప్రదీప్తి రాఖీ వేడుకల్లో భాగంగా సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంది. వాళ్లిద్దరూ ప్రభాస్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టా గ్రామ్‌, ఎక్స్‌ వేదికగా పంచుకోగా అందరూ లైకులు, షేర్లతో ముంచెత్తుతున్నారు. ప్రజెంట్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. 

Read More..

Prabhas: ప్రభాస్ జోకర్‌లా ఉంటాడంటూ నటుడు కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుధీర్ బాబు (పోస్ట్) 

Tags:    

Similar News