వివాదంలో ప్రభాస్ 'Adipurush'.. ట్విట్టర్‌లో ట్రెండింగ్
Hashtags against Adipurush trend on Twitter
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. దీనిని రామాయణం అధారంగా డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించారు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అక్టోంబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా లేదని పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. తాజాగా, 'ఆదిపురుష్' సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇందులోని పాత్రలపై బీజేపీ మండిపడుతోంది. ఈ మూవీ టీజర్‌ను చూస్తుంటే క్యారెక్టర్లు గందరగోళంగా ఉన్నాయని. ఆరు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్షలు చేశారు.
ముఖ్యంగా సైఫ్ రావణాసురుడి గెటప్‌లో అల్లాఉద్దీన్‌ఖిల్జీని పోలీఉందంటూ ఫైర్ అవుతున్నారు. రావణాసురిడి గెటప్‌లో జంధ్యం కూడా కనిపించలేదని. పుష్పక విమానం స్థానంలో పక్షి ఉందని. నుదిటిపై మూడు నామాలు లేవని. వానర సైన్యం పైన కూడా అభ్యంతరాలు ఉన్నాయని. రావణుడి కంటికి సుర్మ ఎలా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదంటూ బీజేపీ హెచ్చరిస్తోంది. టీజర్‌పై అసహనం వ్యక్తం చేసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిజప్పాయింట్ అయ్యామంటూ హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఆదిపురుష్ మూవీపై బీజేపీ మహిళా నేత షాకింగ్ కామెంట్స్..
'#Disappointed' trends on Twitter as 'Adipurush' teaser fails to impress