పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి సుపరిచితమే. పవన్.. మూడు సినిమా షూటింగ్‌లను పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాల్లో ఊపిరి మెసలనంత బిజీగా ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి సుపరిచితమే. పవన్.. మూడు సినిమా షూటింగ్‌లను పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాల్లో ఊపిరి మెసలనంత బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో, టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయబోతన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్.. పొలిటికల్ మీటింగ్స్, ప్లానింగ్స్ కోసం తీరిక లేకుండా గడుపుతున్నారు. పవర్ స్టార్ తాజాగా లోకేష్ యువగళం ముగింపు సభలో పాల్గొన్నారు. అయితే ఈ హీరోకు హెల్త్ కండిషన్ బాలేదంటూ తాజాగా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఓ వార్త వైరల్ చేస్తున్నారు. గత రాత్రి నుంచి పవన్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట.
దీంతో ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ కారణంగా.. పవన్.. ఇప్పుడు ప్లాన్ చేసుకున్న తన పొలిటికల్ రిలేటెడ్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనకపోవచ్చని, ట్రీట్మెంట్ తీసుకుని కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈయన ఎక్కువరోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు, పవన్ వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు.. దీంతో పవన్ తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.