పూనమ్ పాండే డెత్ స్టంట్.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
ప్రముఖ నటి పూనమ్ పాండే మౄతి చెందినట్లుగా.. ఆమె మేనేజర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: ప్రముఖ నటి పూనమ్ పాండే మౄతి చెందినట్లుగా.. ఆమె మేనేజర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పూనమ్ నిజంగానే చనిపోయిందంటూ చాలా మంది ఆమెకు సంతానం కూడా తెలియజేశారు. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ.. నేను చనిపోలేదు బతికే ఉన్నాను అంటూ పూనమ్ పాండే తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ‘గర్భాశయ క్యాన్సర్‌తో నేను చనిపోలేదు. కానీ ఇలాంటి వ్యాధితో చాలా మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
దీంతో నెట్టింట ఆమెపై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది. పూనమ్ పాండేపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూనమ్ పాండే మరణంపై వార్తలు వచ్చినప్పుడు ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తి.. ‘గర్భాశయ క్యాన్సర్‌తో ఎవరూ సడెన్‌గా మరణించరు.. ఆమె మృతి కేసును దర్యాప్తు చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా ముంబయి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆమె మరణ వార్త అవాస్తవం అని తెలిసిన తర్వాత పబ్లిసిటీ స్టంట్‌పై పోలీసులు చర్యలు తీసుకోకపోతే తాను కోర్డు ఆశ్రయిస్తానని రెమిడియోస్ పేర్కొన్నారు. ఈ పబ్లిసిటీ స్టంట్ పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్‌లకు నిదర్శనమని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీరియస్ అయ్యారు. కాగా పూనమ్ పాండే ఇష్యు ఇంకెన్ని వివాదాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.