ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది అంటున్న పూజ.. ఆ కోరిక ఏమిటంటే?

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో ఈమె ఒకరు. ఇక మొన్నటి వరకు టాలీవుడ్‌లో వరస సినిమాలతో దూసుకెళ్లిన ఈముద్దుగుమ్మ ప్రస్తుతం కాస్త స్లో అయ్యిందని చెప్పవచ్చు.

Update: 2023-04-22 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో ఈమె ఒకరు. ఇక మొన్నటి వరకు టాలీవుడ్‌లో వరస సినిమాలతో దూసుకెళ్లిన ఈముద్దుగుమ్మ ప్రస్తుతం కాస్త స్లో అయ్యిందని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భఆయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లో పాల్గొన్న బుట్టబొమ్మ కొన్ని ఆసక్తికర విషయాలను తమ అభిమానులతో పంచుకుంది.

పూజా మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌ ప్రారంభం నుంచీ అనేక కమర్షియల్‌ చిత్రాల్లో నటించాను. గ్లామర్‌ తారగా పేరు తెచ్చుకున్నాను. అయితే నాకు నటిగా, నా నటనను చూపించే అవకాశం రాలేదు దాని కోసమే ఎదురు చూస్తున్న. వీలైతే, త్వరలో ఓ ఫీమెల్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తా అంటూ చెప్పకొచ్చింది. ఆ ఒక్క కోరికే తీరలేదంటూ బుట్టబొమ్మ తన మనసులో మాట బయట పెట్టింది.

Also Read...

ఆ ఒక్క కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడంట!

Tags:    

Similar News