దయచేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా చేయకండి.. నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్ (పోస్ట్)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర.’
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర.’ ఇది సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తెరవగా.. టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్మడుపోతున్నాయి. ఈ క్రమంలో.. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగవంశీ తారక్ అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘ఎన్టీఆర్ అన్న చాలా గ్యాప్ తర్వాత ఎమోషనల్, మాస్ కంటెంట్‌తో కూడుకున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనవంతు బాధ్యతగా మంచి కంటెంట్‌ని అందించడానికి ట్రై చేస్తున్నారు.
ప్రభుత్వ సాయంతో చాలా రోజుల తర్వాత బెనిఫిట్ షోలు, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో దీనిని విడుదల చేసేలా మేము మా బాధ్యత పూర్తి చేశాం. కాబట్టి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా బాధ్యతగా ఉండటంతో పాటు ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైన ఫ్యాన్స్ వార్స్ క్రియేట్ చేయకండి. ఇలాంటి వాటి వల్ల మన సినిమాపై మనమే నెగిటివిటీ ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. దీనివల్ల తాత్కాలిక ఆనందం పొందుతారు కానీ మన హీరోల మూవీస్‌పై ప్రభావం చూపిస్తుంది. దయచేసి అభిమానులంగా ఫ్యాన్స్ వార్లాంటివి చేయకండి.
సినిమాని ఎంజాయ్ చేయండి అంతేకానీ ఫస్ట్ స్క్రీనింగ్‌లో మూవీ చూసిన వారు వీడియోలు షేర్ చేయొద్దు. పక్కవారు వీడియో తీయకుండా మీరే చూడండి.ఎందుకంటే.. మీ తర్వాత చూసేవారు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. తారక్ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ అందిద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే లవ్ యూ’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు గుడ్ నోట్ అని కామెంట్లు పెడుతున్నారు.