rashmi gautam: అవి రెండింటికీ చాలా తేడా ఉంది.. దయచేసి ఇప్పుడు ఆ వీడియోను ఉపయోగించకండి: రష్మి
బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తర్వాత పలు షోస్‌తో పాటు సినిమాల్లోనూ నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తర్వాత పలు షోస్‌తో పాటు సినిమాల్లోనూ నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్రజెంట్ బుల్లితెర స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న రష్మి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై రియాక్ట్ అవుతోంది. అలాగే జంతువులపై జరుగుతున్న దాడులను అడ్డుకుంటూ తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తోంది. ఈ క్రమంలో.. రష్మి కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కోవడం గురించే అలాంటి కామెంట్స్ చేసిందని ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న రష్మి ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘‘మైనర్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం కాస్టింగ్ కౌచ్‌కు చాలా తేడా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక, సమ్మతికి సంబంధించినది. అయితే నేను 2020 కంటే ముందే నేను ఓ ఇంటర్వ్యూ ఇచ్చి పలు కామెంట్స్ చేసిన వీడియోను గత కొద్ది రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోను ఇప్పుడు ఉపమోగించి పాఠకులను తప్పుదోవ పట్టించవద్దు. పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’’ అని రాసుకొచ్చింది.