వివాదస్పదంగా ఆ దర్శకుడి కోరికలు.. రోజురోజుకు అతడిలో ఆ పిచ్చి పెరుగుతుందా..?

చిన్న హీరోల నుంచి అగ్రహీరోల వరకు సినిమాలు తీసి సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన.

Update: 2024-08-21 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చిన్న హీరోల నుంచి అగ్రహీరోల వరకు సినిమాలు తీసి సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. బ్లాక్ బస్టర్ మూవీలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆ డైరెక్టర్. కానీ ఆయనకు ఓ తిక్క ఉంది. అయితే ఆ తిక్కకు ఏ లెక్క లేదన్నది ఫిల్మ్ నగర్‌లో టాక్. తనను తాను అతిగా ఊహించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ఆ డైరెక్టర్ ఫ్యాన్సే చెవులు కొరుక్కుంటున్నారు. దిగ్గజ డైరెక్టర్ల సరసన తన ‘కటౌట్’ ఉండాలనేది ఆయన పిచ్చి కోరిక. అయితే ఆ స్టార్ డమ్ తను కోరుకుంటే వచ్చేది కాదు.. అభిమానులే కట్టబెట్టాలన్నది ఆయనకు తెలియకపోవడం విడ్డూరమే.

ఇంతకు విషయం ఎంటంటే.. సినిమా రిలీజ్ సమయంలో హీరోలకు సమానంగా తనకూ భారీ కటౌట్స్, ఫ్లెక్సీలు కట్టాలని డిమాండ్ చేయడమే. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకులకు పెట్టిన మాదిరిగానే తనకూ సినిమా థియేటర్లలో హీరోలతో పాటు ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారట. ప్రతి థియేటర్‌లో పబ్లిసిటీ చేయాలని పట్టుబడుతున్నారట. ఆయన తీరును చూసిన ఫిల్మ్ నగర్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఈ డైరెక్టర్‌కు ఇవేం కోరికలు.. పిచ్చి రోజురోజుకు బాగా ముదురుతుందిగా అంటూ చలోక్తులు వేసుకుంటున్నారట. కాగా, ఈ దర్శకుడి సినిమా ఇటీవలనే రిలీజై.. నెగిటివ్ టాక్‌లో వెళ్తుంది. పాటల్లో మితిమిరిన రొమాన్స్ చేయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Similar News