Pekamedalu Movie Review: పేకమేడలు మూవీ రివ్యూ
సినీ ఇండస్ట్రీలో వినూత్నంగా ప్రమోషన్ చేసిన పేకమేడలు రిలీజ్ కు ముందే భారీ హైప్ ను క్రియోట్ చేసింది.
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో వినూత్నంగా ప్రమోషన్ చేసిన పేకమేడలు రిలీజ్ కు ముందే భారీ హైప్ ను క్రియోట్ చేసింది. ఈ సినిమాలో నటించిన హీరో వినోద్ ప్రమోషన్ కి డబ్బులు లేవు మీరు కొంచం డబ్బు సహాయం చేస్తే నా సినిమా గండం గట్టెక్కుతుంది. ఈ మూవీ హిట్ అవ్వగానే ఎవరి డబ్బులు వారికీ ఇచ్చేస్తా అంటూ వీడియో పోస్ట్ చేసారు. ఇది చూసిన ప్రేక్షకులు నిజంగానే మనీ పంపాలని చూసారు కానీ, ఓపెన్ స్కాన్ చేయగానే సినిమా ట్రైలర్ వచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేడు ఈ మూవీ థియేటర్లలో పేకమేడలు మూవీ ఎలా ఉందొ ఇక్కడ తెలుసుకుందాం.
నీలగిరి మామిళ్ళ డైరెక్షన్ చేసిన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పేకమేడలు సినిమాకి వినోద్ కిషన్, అనూష కృష్ణ నటన చాలా ప్లస్ అయింది. ఒక మధ్యతరగతి కుంటుంబ జీవితాల గురించి చక్కగా చూపించారు. బీటెక్ చదవగానే జాబ్ కొట్టి డబ్బు బాగా సంపాదించాలన్న అబ్బాయి పాత్రలో వినోద్ బాగా నటించాడు. టెక్నికల్ గా ఈ మూవీ మంచి మార్కులు వేపించుకుంది. కథని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆర్ఆర్ బాగా సెట్ చేసారు.
కథ విషయానికొస్తే.. బీటెక్ చదువుకున్న వినోద్ ( హీరో ) భార్య సంపాదనతో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు ఎలా అయినా డబ్బులు సంపాదించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మధ్యలో ఓ ఆంటీ వలలో పడతాడు ఆ విషయం భార్యకి తెలుస్తుంది. ఆ ఆమె ఏమి చేసిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు, సెకండాఫ్ లో గుర్తు పట్టే నటులు లేకపోవడం వలన కొంచం డల్ గా అనిపించింది. అది ఒక్కటి తప్ప సినిమా మొత్తం చాలా బాగుంది. ఈ మూవీతో వినోద్ మంచి హిట్ కొట్టాడు.