నా ఊహాల్లో హీరో అంటే ఆయన ఒక్కరే: పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శిల్పా కళా వేదికలో బ్రో మూవీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. వర్షం వల్ల ఈ ఈవెంట్ ఆలస్యమైనప్పటికీ 11 గంటల వరకు అభిమానులు అలాగే ఉన్నారు.

Update: 2023-07-25 17:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: శిల్పా కళా వేదికలో బ్రో మూవీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. వర్షం వల్ల  ఈవెంట్ ఆలస్యమైనప్పటికీ 11 గంటల వరకు అభిమానులు అలాగే వేచి ఉన్నారు. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంత అభిమానులను సినిమానే ఇచ్చిందని.. ఒక్కొసారి ఇంత మంది అభిమానులను చూస్తుంటే ఇది కలా నిజం అనిపిస్తుందన్నారు. తను నటుడు అవుతానని, పాలిటిక్స్‌లోకి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదన్నారు. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం మాటల్లో చెప్పలేనన్నారు. బ్రో సినిమా కథ కరోనా టైమ్‌లో త్రివిక్రమ్ చెప్పడంతో విన్నానని చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించడంతో నటించేందుకు ఒకే చెప్పానని తెలిపారు.

బ్రో మూవీ డైరెక్టర్ సముద్రఖని టాలెంటెండ్ వ్యక్తి అని ప్రశంసించారు. సముద్రఖని తమిళ వ్యక్తి అయిన.. కేవలం 6 నెలల్లో తెలుగు మాట్లాడటం నేర్చకున్నాడని.. దీంతో ఆయనకి నేను అభిమాని అయిపోయానని పవన్ అన్నారు. తాను కూడా సముద్ర ఖని కోసం తమిళ్ స్పష్టంగా నేర్చుకోని తమిళ్‌లో స్పీచ్ ఇస్తానని మాటిచ్చారు. తెలుగు మాతృ భాష అయ్యిండి.. తెలుగుకు రానివారికి సముద్రఖని ఒక కనువిప్పు కలిగించారని అన్నారు. తాను జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లా గొప్పగా డ్యాన్స్ చేయలేకపోవచ్చు కానీ.. సినిమా అంటే తనకు ప్రాణమన్నారు. ఇక సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికి చెందింది కాదన్నారు. నా ఊహాల్లో హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే అని అన్నారు.

Also Read: పదునెక్కుతున్న జనసేనాని!

Tags:    

Similar News