పవన్ కల్యాణ్ మూడో భార్యతో విడాకులు.. అసలు నిజం ఇదే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

Update: 2023-07-05 11:10 GMT
పవన్ కల్యాణ్ మూడో భార్యతో విడాకులు.. అసలు నిజం ఇదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఏపీలో వారాహిపై విజయయాత్ర చేస్తూనే ‘బ్రో’ సినిమా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు పవన్. ఇక రాజకీయ, సినిమాల జీవితం గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది సోషల్ మీడియా. పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లేజినోవాకు విడాకులు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి వీటిలో నిజం ఎంత వరకు ఉందో తెలుసుకుందాం.

నిజానికి పవన్ కల్యాణ్ విడాకుల వార్తలు నెట్టింట వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. అంతే కాకుండా.. ఇటీవల జరిగిన మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌కు పవన్ కల్యాణ్ ఒక్కరే హాజరయ్యారు. దాంతో పాటు ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనూ తన మూడో భార్య అన్నా లేజినోవా కనిపించడం లేదు పవన్. ఈ కారణం చేతనే పవన్ కల్యాణ్ విడాకుల ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొంత కాలంగా పవన్, లెజ్నోవా కూడా విడివిడిగా ఉంటుండటంతో ఈ విడాకుల వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండి తన భార్యకు దూరంగా ఉంటున్నారో.. లేక నిజంగానే ఆమెకు విడాకులు ఇస్తున్నారో తెలియదు కానీ ఎలక్షన్ల ముందు ఇలాంటి వార్తలు రావడంపై జనసేనాని ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

Pawan kalyan instagram : ఇన్‌స్టాలో పవన్ ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా?  

Niharika Divorce: భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా?  

Tags:    

Similar News