పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు.. ఈ పవర్ ఫుల్ హౌజ్ చూస్తే మతిపోవాల్సిందే!

ఏపీ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్షాలు హోరా హోరీగా క్యాంపెయినింగ్

Update: 2024-04-21 12:34 GMT

దిశ, సినిమా: ఏపీ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్షాలు హోరా హోరీగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు కోసం ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడిపోయారు. ఇక గతంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని ఈ సారి కచ్చితంగా గెలుపును తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసి.. గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు శాయశక్తులా కష్టపడుతున్నారు. అందుకే అక్కడే మకాం వేశారు.

హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామనే ఉద్దేశంతో మూడు అంతస్తుల బిల్డింగ్ కూడా కొనేశాడు పవన్. ఇక ఈ బంగ్లా ప్రస్తుతం రాజకీయ చర్చలు, కార్యకర్తల రాకతో కళకళలాడుతుండగా.. అక్కడ ఆయనను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. వీడియో తీసుకుని పవర్ స్టార్ 'పవర్ ఫుల్ హౌజ్'ను అందరూ చూడాలి అంటూ నెట్టింట అప్ లోడ్ చేశారు. ఇక దీన్ని చూసిన జన సైనికులు.. ఇకపై అక్కడే ఉంటావ్ అన్న విజయం మనదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Tags:    

Similar News