Pawan kalyan instagram : చరిత్ర సృష్టించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఫెయిల్యూర్ సినిమా మరో స్టార్ హీరో హిట్ సినిమాతో సమానంగా కలెక్ట్ చేస్తుందని ఏకంగా ఇండస్ట్రీలోని వ్యక్తులే చెబుతుండటం చూశాం.

Update: 2023-07-04 12:09 GMT
Pawan kalyan instagram : చరిత్ర సృష్టించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఫెయిల్యూర్ సినిమా మరో స్టార్ హీరో హిట్ సినిమాతో సమానంగా కలెక్ట్ చేస్తుందని ఏకంగా ఇండస్ట్రీలోని వ్యక్తులే చెబుతుండటం చూశాం. టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్.. మరో అరుదైన ఘతన సాధించారు. గ్రాండ్‌గా ఇవాళ(జులై 4న) ఇన్‌గ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. అకౌంట్ క్రియేట్ చేసిన 8 గంటల్లోనే ఏకంగా 10 లక్షలకు పైగా ఫాలోవర్లకు సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఒక్క పోస్టు కూడా పెట్టకుండానే ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక హీరోగా కల్యాణ్ చరిత్ర సృష్టించారు. అయితే.. తమ అభిమాన హీరో ఇన్‌గ్రామ్‌లోకి అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొత్త అకౌంట్ ఫొటోలు షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. పోస్టు పెట్టడకుండానే పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించడంతో ‘ఇది మా పవర్ స్టార్ రేంజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్న పవన్ కళ్యాణ్.. ?  

ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి పెద్ద కూతురు మూవీ కూడా తీసింది.. అప్పుడే అలా జరిగింది..  

Tags:    

Similar News