థియేటర్ స్క్రీన్ చించేసి.. రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని జూన్ 30న లేటెస్ట్ 4కె టెక్నాలజీతో థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-07-01 06:16 GMT
థియేటర్ స్క్రీన్ చించేసి.. రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రాన్ని జూన్ 30న లేటెస్ట్ 4కె టెక్నాలజీతో థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పట్టరాని సంతోషంలో పవన్ ఫ్యాన్స్ టాకీస్‌లో కేకలు, స్లోగన్స్‌తో రచ్చ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానులు విజయవాడలోని కపర్ది థియేటర్‌లో స్క్రీన్ చించేసి, కూర్చీలు విరగొట్టి నానా బీభత్సం సృష్టించారు. ‘‘పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ఫ్యాన్స్ పలువురికి ఆదర్శంగా నిలవాలి కానీ.. నలుగురితో మాటలు పడే విధంగా చేయడం అస్సలు సరికాదంటూ’’ పవన్ కల్యాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.  

Read More:    Mahesh Babu ‘గుంటూరు కారం’ అప్డేట్.. గ్యాప్ లేకుండా 20 రోజులు అదేపనట!



Similar News