Uruku Patela: ఉరుకు పటేల మూవీ నుంచి ‘పట్నం పిల్ల’ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌ హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

Update: 2024-08-13 11:24 GMT

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌ హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇప్పుడు మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టంపై త‌న దృష్టి పెట్టిన తేజస్ ‘ఉరుకు పటేల’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతున్నారు. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. సెప్టెంబ‌ర్ 13న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో సోమవారం ఈ మూవీ నుంచి ‘పట్నం పిల్ల..’ అనే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇది గ్రామీణ నేప‌థ్యంలో భావోద్వేగాల ప్ర‌ధానంగా సాగే చిత్రం.

లిరిక‌ల్ సాంగ్ గ‌మ‌నిస్తే.. హీరోయిన్ ప‌ట్నం నుంచి సెల‌వుల‌కు ప‌ల్లెటూరుకి వ‌స్తుంది. అక్క‌డ హీరో ఆమెను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. త‌న మ‌న‌సులోని ప్రేమ‌లో తెలియ‌జేసేందుకు త‌ను పడే పాట్లు, మ‌న‌సులోని భావాల‌ను వ్య‌క్తం చేసే పాట ఇద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ప్ర‌వీన్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు. ‘ప‌ట్నం ప‌ల్ల..’ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించారు. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.


Full View

Tags:    

Similar News