పరిణీతి చోప్రా వెడ్డింగ్ లెహంగా డిజైన్ చేయడానికి ఎన్ని వందల గంటలు పట్టిందో తెలిస్తే షాక్..
ఎంపీ రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా సెప్టంబరు 24 వ తారీకున రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అంగరంఘ వైభవంగా కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా సెప్టంబరు 24 వ తారీకున రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అంగరంఘ వైభవంగా కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పలువురు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి పరిణీతి ధరించిన లెహాంగాను చేతితో డిజైన్ చేశారట. ఇందుకు దాదాపు 2500 గంటలు పట్టిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అందమైన టోనల్ ఎక్రూ బేస్‌ను అద్భుతమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అలంకరించారు. పాతకాలపు బంగారు దారాన్ని ఉపయోగించారట. ముఖ్యంగా పరిణీతి ధరించిన దుపట్టాకు దేవనాగరి స్క్రిప్ట్‌లో రాఘవ్ పేరును బద్లా వర్క్‌లో రూపొందించారు. రష్యన్ పురాతన పచ్చలను యాడ్ చేయడం వల్ల మరింత ఆకట్టుకునేలా కనిపించింది. ఈ వార్త విన్న నెటిజన్లు పరిణీతి డ్రెస్ తయారీకి అన్ని గంటల టైమ్ పట్టిందా? వామ్మో? అంటూ కామెంట్లు చేస్తున్నారు.