ఆస్కార్ ఉత్తమ నటుడిగా బ్రెండన్ ఫ్రేజర్

95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్తమ నటుడిగా.. బ్రెండన్ ఫ్రేజర్ ఆస్కార్ అందుకున్నాడు.

Update: 2023-03-13 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్తమ నటుడిగా.. బ్రెండన్ ఫ్రేజర్ ఆస్కార్ అందుకున్నాడు. అతనికి 'ది వేల్' చిత్రానికి గాను ఈ ఆస్కార్ అవార్డు దక్కింది. అలాగే 'ఎవరీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రానికి గానూ మిచెల్ యో ఉత్తమ నటి ఆస్కార్‌ను గెలుచుకుంది. దీంతో ఆమె ఆసియా నుంచి ఆస్కార్ పొందిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. 'ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు గానూ.. డానియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ ఉత్తమ దర్శకత్వ అవార్డును గెలుచుకున్నారు. అలాగే అస్కార్ అవార్డుల్లో.. ఉత్తమ చిత్రంగా 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' నిలిచింది.

Tags:    

Similar News