హీరోయిన్లే అర్ధరాత్రి నిర్మాతల వద్దకు వెళ్తారు: స్టార్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Update: 2023-08-01 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హీరోయిన్లు ఛాన్స్‌ల కోసం నిర్మాతల దగ్గరకు వెళ్తే వేధిస్తున్నారంటూ కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ ఆరోపణలపై స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ స్పందించి.. ‘‘కొందరు కావాలనే నిర్మాతలను టార్గెట్ చేస్తున్నారు. నిజానికీ హీరోయిన్లు అవకాశాల కోసం నిర్మాతల వద్దకు అర్ధరాత్రి కూడా వెళ్తారు. వారిని కలిసి తర్వాత సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్లను నిందిస్తారు. వారికి సరిపోయే రోల్ లేకపోతే ఎలా తీసుకుంటారు. మీ అవకాశాల కోసం మీరే వెళ్లి.. తర్వాత మాపై తప్పుడు టాక్ తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్. ఓ పొజీషన్‌లో ఉన్నారు కదా అని నిర్మాతలపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సినిమాలో ఛాన్స్ ఇవ్వకుంటే ఎవరిని నిందించకూడదు. వారికి ఆ పాత్ర సెట్ అవ్వపోతే తీసుకోరు. అవసరాన్ని బట్టి అవకాశాలు వస్తాయి. ఏదైనా సరే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.’’ అంటూ ఏక్తా కపూర్ కాస్త ఫైర్ అవుతూ చెప్పకొచ్చింది.

Also Read:   అనుష్క తల్లిని చూశారా.. ఫిదా అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ 


Similar News