Bigg Boss 8: మరోసారి ఒకే బిగ్ బాస్ స్టేజిపై ఇద్దరు హోస్ట్‌లు..

మరోసారి ఒకే బిగ్ బాస్ స్టేజిపై ఇద్దరు హోస్ట్‌లు..

Update: 2024-09-01 02:46 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్‌బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదొవ సీజన్ కి రెడీ అయింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇప్పటికే ప్రోమోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంత గానో వేచి చూస్తున్నారు. సమయం రానే వచ్చేసింది.

తెలిసిన సమాచారం ప్రకారం ఈ రోజు బిగ్ బాస్ లాంచింగ్ కి హీరో నాని గెస్ట్ గా రాబోతున్నాడట. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని బిగ్ బాస్ లోకి మరోసారి అడుగుపెట్టనున్నాడు. నానికి సంబందించిన షూట్ కూడా కంప్లిట్ ఐనట్లు తెలుస్తుంది.

నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ చేస్తున్నప్పుడు ఇంతకముందు కూడా గెస్ట్ గా వచ్చి అలరించాడు. ఈ సీజన్ 8 లో ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే నానిని చూడబోతున్నాం. దీంతో స్టేజిపై ఒకేసారి మాజీ హోస్ట్ నాని, నాగార్జున ఇద్దరూ కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నారు.

Tags:    

Similar News