Chay & Samantha : సమంతతో విడాకులపై ప్రశ్నించగా నాగచైతన్య రియాక్షనేంటో తెలుసా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’.
దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 12న విడుదల కాబోతోంది. ఇందులో చైతూకి జోడిగా కృతి శెట్టి నటించింది. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు. ‘మీరు జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తాప పడ్డ రోజులున్నాయా ?’ అని యాంకర్ ప్రశ్నించగా ‘అలాంటిదేమీ లేదు. నా లైఫ్‌లో జరిగిన ప్రతీ సంఘటనను ఓ గుణపాఠంగా భావిస్తా’ అని సమాధానమిచ్చాడు. అలాగే ‘మీరు సినిమాల పరంగానో లేదా సమంతతో డివోర్స్ తీసుకున్నందుకో బాధ పడిన క్షణాలున్నాయా ?’ అని యాంకర్ మళ్లీ ప్రశ్నించగా.. చైతు మాత్రం ఆ విషయం దాటవేస్తూ మూవీస్ గురించి మాత్రమే స్పందించాడు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు చాలా ఫీలయ్యానంటూ చెప్పుకొచ్చాడు కానీ.. డివోర్స్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రజెంట్ అతని మాట్లాడిన నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read more :
Naga Chaitanya :పాతబస్తీలో సందడి చేసిన అక్కినేని నాగ చైతన్య..