హీరోయిన్ అదితీ రావ్ హైదరీపై మాజీ భర్త వైరల్ కామెంట్..

అదితితో రిలేషన్ ప్రేమ మీద విరక్తి కలిగించింది.

Update: 2023-02-04 09:14 GMT

దిశ, సినిమా: హీరోయిన్ అదితీ రావ్ హైదరీ కెరీర్‌లో సక్సెస్‌ అందుకుంది కానీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. నటుడు సత్యదీప్ మిశ్రాని 2009లో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె.. 2013లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ చేస్తుండగా.. మాజీ భర్త నీతూ గుప్తా కూతురు మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అదితి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'అదితితో రిలేషన్ ప్రేమ మీద విరక్తి కలిగించింది. బ్రేకప్ అనుభవం మళ్లీ ప్రేమ, పెళ్లి అంటే భయపడేలా చేసింది. కానీ కోల్పోయినవి పొందాలనుకునే ధైర్యంగా ముందడుగు వేశా. అందుకే సింపుల్‌గా పెళ్లి చేసుకున్నా. జనవరి 27న ఉదయం రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత బంధుమిత్రులకు చిన్న పార్టీ ఇచ్చాం . మా బంధం గురించి దాచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. రహస్యాలు బంధాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అందుకే ఒపెన్‌గా ఉండాలి' అని చెప్పుకొచ్చాడు. 

Tags:    

Similar News