Mahesh Babu Okkadu Re Release..ఎన్ని థియేట‌ర్లలో విడుదలవుతోందంటే

మ‌హేష్‌ బాబు కెరీర్‌లో " ఒక్కడు " సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో మనకు తెలిసిందే.

Update: 2023-01-07 06:37 GMT

దిశ, సినిమా : మ‌హేష్‌ బాబు కెరీర్‌లో " ఒక్కడు " సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో మనకు తెలిసిందే. ఇర‌వై ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ అతనికి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. క‌బ‌డ్డీ ఆట, రాయ‌ల‌సీమ ఫ్యాక్షనిజం, ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శకుడు గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 8 నంది అవార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇకపోతే సినిమా విడుద‌లై 20 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా మ‌రోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. శ‌నివారం (నేడు) ఈ మూవీ, తెలంగాణ‌, ఏపీలో క‌లిపి దాదాపు 250 నుంచి 300 థియేట‌ర్లలో రీ రిలీజ్ అవుతున్నట్టు స‌మాచారం. హైద‌రాబాద్‌లోనే వంద‌కు పైగా థియేట‌ర్లలో ఈ మూవీ రీ రిలీజ్ అవుతున్నట్టు స‌మాచారం. సిటీలోని ప‌లు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో తొలిరోజు ఏడుకు పైగా షోలు స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. మొత్తానికి సంక్రాంతి వ‌ర‌కు ఈ సినిమాను థియేట‌ర్లలో ప్రదర్శించ‌బోతున్నట్లు తెలిసింది. అయితే "ఒక్కడు " రీ రిలీజ్ ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్ కోటి రూపాయ‌లు దాటే అవ‌కాశం ఉన్నట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. 

Also Read..

సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న'Varasudu ' 

Tags:    

Similar News