Janhvi Kapoor: అభిమానికి రాఖీ కట్టిన ఎన్టీఆర్ హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో

అభిమానికి రాఖీ కట్టిన ఎన్టీఆర్ హీరోయిన్

Update: 2024-08-20 02:45 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేవర మూవీలో హీరోయిన్ గా ఒకే ఐనప్పటి నుంచి ఈ భామ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటీవలే విడుదలైన దేవర సెకండ్ సింగిల్ చుట్టుమల్లె పాటలో జాన్వీ మన తెలుగు వారికి బాగా నచ్చేసింది. తాజాగా ఈమెకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఆగస్టు 19 న దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు వారి తోబుట్టువులకు రాఖీలు కట్టారు. ఈ ఫెస్టివల్ ను సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు సంతోషంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్ళు తమ బ్రదర్స్ కట్టిన రాఖీలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ రాఖీ అంటూ విషెస్ తెలుపుతున్నారు. అయితే, ఈ పండుగ రోజున సోషల్ మీడియాకి ఒక ఆసక్తికరమైన వీడియో చిక్కింది. దానిలో ఏముందో ఇక్కడ చూద్దాం

జాన్వీ చాలా సింపుల్ గా కనిపించి ఓ అభిమాని చేతికి రాఖీ కట్టిన వీడియో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ముంబైలోని ఓ మూవీ ఓ షూటింగ్ లో పాల్గొన్న ఆమెను చూడటానికి ఫ్యాన్స్ వచ్చారు. అక్కడ ఓ అభిమాని రాఖీ, తనకు కట్టమని అడిగాడు.. దీనికి ఆమె వెంటనే అతని చేతికి రాఖీ కట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజెన్స్ మీ మనసు చాలా మంచిదంటూ.. కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Tags:    

Similar News